ఆంధ్రప్రదేశ్‌

బదిలీ టీచర్లకు రిలీవ్ ఉత్తర్వులేవీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: దేశవ్యాప్తంగా ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉన్నతాధికారుల బదిలీలు రాత్రికి రాత్రే జరిగిపోతుంటాయి. అన్నీ సవ్యంగా వుంటే ఏకంగా ప్రభుత్వాల మార్పిడి కూడా సాఫీగా జరిగిపోతుంటుంది. మరి కారణమేమిటో కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి కూడా ఉపాధ్యాయుల బదిలీల్లో ఎప్పుడూ గందరగోళం నెలకొంటూ ఉంటుంది. అనాది నుంచీ సమితి అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అన్నింటికీ మించి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల జోక్యం టీచర్ల బదిలీల్లో ఉంటూనే వస్తోంది. సమితులు రద్దయిన తర్వాత వాటి స్థానంలో మండలాధ్యక్షులు వచ్చారు. ఇక ఇటీవలి కాలంలో కౌనె్సలింగ్, పారదర్శకత పదాలనేకం నిత్యకృత్యమైనప్పటికీ టీచర్ల బదిలీల వెనుక రాష్టవ్య్రాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఎవరికి వారు తమ సొంత వ్యాపకాల కోసం పనిచేసే చోటే స్థిరంగా వుండిపోవాలనుకోవటం, మున్సిపాల్టీల్లో అయితే కనీసం మరో వీధిలోని స్కూల్‌కు కూడా బదిలీపై వెళ్లకూడదనుకోటం వంటి కారణాలతో తొలి నుంచీ ఈ గందరగోళం కొనసాగుతోంది. ఈసారయితే రాష్ట్రంలో కౌనె్సలింగ్ షెడ్యూల్‌కు ముందే పలు జిల్లాల్లో అక్రమంగా టీచర్ల బదిలీలు జరిగాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయని నాయకులు ఆరోపించటంతో షెడ్యూలు విడుదల తరువాత కూడా దాదాపు ఏడెనిమిది ‘సవరణ జీవో’లు జారీ అయ్యాయి.
ఇక ఇటీవల జరిగిన కౌనె్సలింగ్‌లో రాష్టవ్య్రాప్తంగా రికార్డు స్థాయిలో లక్షా 50వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలో జూలై మొత్తం బదిలీల కౌనె్సలింగ్ జరిగింది. వాస్తవానికి గత జూలై 30న రిలీవ్ ఆర్డర్లు తీసుకుని ఆగస్టు రెండో తేదీ నాటికి టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరాల్సి ఉంది. ఈలోపుగానే ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇచ్చిన వీడ్కోలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితేనేమి ఇప్పటివరకు దాదాపు 3వేల మంది టీచర్లకు రిలీవ్ ఆర్డర్లు అందలేదు. దీంతో మూడు నెలల నుంచి విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో పేజీ కదలితే ఒట్టు! తొలుత బదిలీలకు పైరవీలు, ఆపై రిలీవ్ ఆర్డర్ల కోసం టీచర్ల ఎదురుతెన్నులతో విద్యార్థులకు తరగతులే జరగలేదు. గత నెలలో కౌనె్సలింగ్ ముగిసిన తరువాత ఆన్‌లైన్‌లో తమ బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఎప్పుడు రిలీవ్ కావాలో అందులో సమాచారం లేదు. నిబంధనల ప్రకారం డిఇవోలు రిలీవ్ ఆర్డర్లు ఇచ్చిన తరువాత టీచర్లు సంబంధిత ఎంఈవో, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్దకు వెళ్లి కొత్త పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 3వేల మంది టీచర్లు తమ రిలీవ్ ఆర్డర్లు కోసం ఎదురుచూస్తున్నారు. వీరే కాకుండా అప్పీళ్లు పెట్టుకున్నవారిలో కొందరికి కొత్త ప్రదేశాల్లో పోస్టింగ్‌లు లభించలేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతం కోరుకున్నవారు కూడా ఎదురుచూపుల్లో ఉన్నారు. అప్పీళ్లు పెండింగ్‌లో ఉండటంతో తాము కోరుకున్న పాఠశాలలకు వచ్చి జాయిన్ కావటానికి వేచిచూస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రిలీవ్ ఆర్డర్లు పూర్తిగా ఆగిపోయాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కౌనె్సలింగ్ ఆలస్యంగా జరిగింది. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య. ఏదిఏమైనా టీచర్ల బదిలీలు మొదటి నుంచీ ప్రహసనంలా మారాయి. మొత్తంపై ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల చదువులకు మాత్రం శని దాపురించినట్టయింది!