ఆంధ్రప్రదేశ్‌

అవుకు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 5: కర్నూలు జిల్లా అవుకు మండలంలో ఆర్టీసీ బస్సు మంగళవారం అదుపుతప్పి అవుకు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. అయితే రాళ్లు అడ్డుగా రావడంతో బస్సు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. బనగానపల్లె డిపో ఆర్టీసీ బస్సు ఉప్పలపాడు నుంచి అవుకుకు వస్తుండగా పెద్దమ్మ కనుమవద్ద అదుపుతప్పి రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. అయితే బండరాళ్లు అడ్డురావడంతో బస్సు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో బస్సులోని 70 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. నెమ్మదిగా బస్సుదిగి గట్టుపైకి చేరుకున్నారు. బస్సు నేరుగా వెళ్లి నీళ్లలో పడిఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది.