ఆంధ్రప్రదేశ్‌

నేడు విశాఖ నుంచి ‘జలసిరి హారతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: సమగ్ర నీటి నిర్వహణకు పెద్దఎత్తున ప్రచారం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ‘జలసిరి హారతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో బుధవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల నిర్వహణ, యాజమాన్యం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జన జీవనానికి జీవనాధారమైన జల వనరులను పూజించుకోవడం ద్వారా నూతన ఒరవడికి విశాఖ నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం ఇప్పటికే ఏరువాక, వనం-మనం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ తరహాలోనే జల వనరులను రక్షించుకునే ఉద్దేశంతో నదులు, వాగులు, వంకలు, నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యాంలు, చెరువులు, పంటకుంటలు తదితర జలవనరులకు ప్రణమిల్లే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాన్ని విశాఖలో జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శారదా నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనుండడం గమనార్హం. కశింకోట మండలం నర్సాపురం వద్ద శారదానదిపై రూ.17 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించడం ద్వారా జలసిరి హారతికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాంతంలో 3,480 ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించే నర్సపూర్ ప్రాజెక్టును సిఎం చంద్రబాబు రైతులకు అంకితమివ్వనున్నారు. గొబ్బూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక రైతులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా చేరుకుని జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 1.2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే తోటపల్లి కుడి కాలువ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొంటారు.