ఆంధ్రప్రదేశ్‌

ఉచిత ఇసుక అంటే ఏమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం ఆదేశించి చాలా కాలమే అయింది. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు, సరికదా, గత వారం రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, ఉచిత ఇసుక అంటే ఏంటి? అని విశాఖలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన పథకం ఏ విధంగా నీరుగారుతోందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇసుక మాఫియా కార్యకలాపాలు పెచ్చుమీరడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. దీంతో సుమారు ఏడాది కిందట చంద్రబాబు నాయుడే స్వయంగా జోక్యం చేసుకుని, ఇసుక మాఫియాకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. సొంత పార్టీవారైనా ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సమయంలో పేదవారికి ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ‘ఉచిత ఇసుక అంటే ఏంటి? మేం ఎప్పుడూ ఎవ్వరికీ ఇసుక ఉచితంగా తరలించలేదే!’ అని విశాఖలోని ఇసుక వ్యాపారులు అంటుంటే ఆశ్ఛర్యం వేస్తోంది.మరోపక్క ఇసుక ధరలు ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయి. గడచిన వారం రోజుల్లో ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం విశాఖలో ఆరున్నర యూనిట్ల ఇసుక 23,000 రూపాయలు పలుకుతోంది. ఐదున్నర యూనిట్ల ధర 22 వేలు, నాలుగున్నర యూనిట్ల ధర 17,000, రెండు యూనిట్ల ధర 7,500 నుంచి ఎనిమిది వేల రూపాయలు పలుకుతోంది. గడచిన వారం రోజులతో ఆరున్నర యూనిట్ల ఇసుక ధర ఎనిమిది వేల రూపాయలు పెరిగిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.