ఆంధ్రప్రదేశ్‌

మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: శ్రీకాకుళం జిల్లాలో పలాస మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ ప్రాంత రైతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని సిఎం నివాసంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రైతులు సిఎంను కలిసి అభినందనలు తెలిపారు. పలాస మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూ.466 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రాజెక్ట్ పరిధిలోని సుమారు 24 వేల ఎకరాలకు నీరందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, నాయకులు పాల్గొన్నారు.