ఆంధ్రప్రదేశ్‌

రూ.600 కోట్లతో అమరావతి అమెరికన్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: విజయవాడకు సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద 700 పడకలతో అమరావతి-అమెరికన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన సందర్భంగా తమ ఆలోచనను వివరించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ప్రాజెక్టుకు 20 ఎకరాల భూమిని ఇబ్రహీంపట్నం దగ్గర కేటాయించారని అమరావతి అమెరికన్ హాస్పిటల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేటాయింపులో పారదర్శకతకే పెద్దపీట వేశారని, ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారిశ్రామిక వేత్తలకు అనుమతులు లభిస్తున్నాయని చెప్పడానికి తమ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ‘‘అమరావతి అమెరికన్ ఆస్పత్రి’’ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ఎ1 కనె్వన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైబడి వైద్యరంగంలో అనుభవజ్ఞులైన డాక్టర్ నవనీత్ కృష్ణ గొర్రెపాటి సారధ్యంలో 20 మంది ప్రముఖ వైద్యులు పర్యవేక్షణలో ఆస్పత్రి ఆవిర్భవించనున్నది. ఆసుపత్రి వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ ముక్కపాటి, సిఎఫ్‌ఓ మల్లికార్జునరావు చలసాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన ఆసుపత్రి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటవుతున్నప్పటికీ అనుబంధంగా ఓపి పేషెంట్లకు తక్షణమే చికిత్సకు అందుబాటులో ఉండేలా ఐదు అవుట్ పేషెంట్ కేంద్రాలను విజయవాడ, గుంటూరులో ప్రారంభిస్తున్నామన్నారు.