ఆంధ్రప్రదేశ్‌

తమ్ముళ్లకు థామస్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల మనస్తత్వంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరీక్ష పెట్టారు. మంగళవారం జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో ఈ పరీక్ష నిర్వహించారు. థామస్ టెస్ట్ పేరుతో రూపొందించిన 20 ప్రశ్నలతో తమ్ముళ్ల మనస్తత్వం విశే్లషించే పని ప్రారంభించింది. సదరు నాయకుడు తన గురించి తాను ఏమనుకుంటున్నారు? బలవంతుడా? బలహీనుడా? సొంతంగా నాయకత్వం వహించాలనుకుంటున్నారా? ఒకరి కింద పనిచేయాలని భావిస్తున్నారా? సున్నిత మనస్కుడా? వెంటనే స్పందించే తత్వం ఉన్నవారా? వంటి 20 ప్రశ్నలు రూపొందించారు. నాయకుడు ఇచ్చిన సమాధానం బట్టి, ఆయన మనస్తత్వమేమిటో 10 పేజీల నివేదిక రూపొందిస్తారు. తర్వాత దానిని విశే్లషకుడు అధ్యయనం చేసి, సదరు నేత మనస్తత్వమేమిటో చెప్పి, ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తారు. తొలుత మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఈ ధామస్ టెస్ట్ చేసి, 10 పేజీల నివేదిక ఇచ్చినట్లు పార్టీ ముఖ్యుడొకరు వెల్లడించారు. దాని సారాంశం ఏమిటని ప్రశ్నించగా.. అదంతా రహస్యం బాస్. మీకు చెప్పేదికాదని.. ఓ నేత మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. వర్క్‌షాప్ సందర్భంగా మంత్రి లోకేష్ పార్టీ అధినేత బాబు కంటే ముందుగానే వచ్చి అక్కడున్న అందరినీ కలిశారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో కలివిడిగా తిరిగి, వారితో కలసి భోజనం చేశారు. కాగా, టిడిపి వర్క్‌షాప్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో కలసి ఇబహీంపట్నం పవిత్రసంగమం వద్దకు ఐదు బస్సుల్లో వెళ్లి కృష్ణమ్మకు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో ఈసారి బాబు తమ్ముళ్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈసారి కిందిస్థాయిలో కూడా చేరికలుంటాయని, అంతా కలసి సర్దుకుపోవాల్సిందేనని సంకేతాలిచ్చారు. వైసీపీ శక్తిని మీరంతట మీరే ఎక్కువగా ఊహించుకోవద్దని, నంద్యాల-కాకినాడ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు. వర్క్‌షాప్‌లో కనీసం పదిమంది ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు ట్యాబులు వాడటం రావడం లేదని బాబు గుర్తించారు. ఆ మేరకు ఎవరెవరకు ట్యాబులు వాడటం లేదో చేతులెత్తాలని కోరగా, పదిమంది వరకూ చేతులెత్తారు. మీకు ట్యాబులు ఇచ్చింది ఇంట్లో పెట్టుకుని పూజ చేయడానికా? అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవహరించకపోయినా, టెక్నాలజీని వాడుకోకపోయినా వెనుకబడిపోతారని సున్నితంగా మందలించారు.
ఇక దూసుకుపోతాం: శిద్దా
వర్క్‌షాప్ ఇచ్చిన స్ఫూర్తితో ఇక తామంతా దూసుకుపోతామని మంత్రి శిద్దా రాఘవరావు మీడియాకు చెప్పారు. ‘మేం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ వర్క్‌షాపుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా మేమింకా విద్యార్థులమే. సార్ లాంటి పెద్ద నాయకుడే రోజూ నేర్చుకుంటున్నారు. ఇక మేమెంత? నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల విజయం అందరికీ ఒక గైడ్‌లా పనిచేసింది. జనం కోరికలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మనం చేసిన పనులన్నీ ఓట్లుగా మార్చుకున్నప్పుడే పనిచేసిన ఫలితాలు వచ్చినట్లు లెక్క. కష్టం ఒక్కటే సరిపోదు. దానిని ఫలితాలు సాధించేలా ప్లాన్ చేసుకుంటే మనమే అధికారంలో ఉంటాం. మా సార్ చెప్పే సూత్రం కూడా అదే’నని శిద్దా వ్యాఖ్యానించారు.