ఆంధ్రప్రదేశ్‌

11 నుంచి ‘ఇంటింటికీ టిడిపి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 7: నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు తమ పార్టీకి రిఫరెండమన్న వైకాపా నేత జగన్ ఫలితాలు వెలువడ్డాక మాట మార్చారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన నెల్లిమర్లలోని చంపావతి నదికి జలహారతి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య ఓట్ల వ్యత్యాసం 16 శాతం ఉందన్నారు. గత సాధారణ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలు అమరావతి రాజధాని నిర్మాణం ఇలా అన్నింటిలో వ్యతిరేకిస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత గత మూడేళ్లలో రాష్ట్రంలో సాగునీటి రంగానికి రూ.29,130 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత మూడేళ్లలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని తెలియజేసేందుకు ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. 50 రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో అన్ని మండలాలు, గ్రామాల్లో ర్యాలీల ద్వారా అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. ఈ నెల 12, 13 తేదీల్లో మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మీసాల గీత, కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, చిరంజీవులు, ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.