ఆంధ్రప్రదేశ్‌

త్వరలో పిల్లల డాక్టర్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 7: రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న పీడియాట్రీషియన్, గైనకాలజిస్టుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం కెజిహెచ్‌లో పలు వార్డులు, క్యాజువాలటీ విభాగాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, కలెక్టర్‌తో కలిసి కెజిహెచ్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సిఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న భవన నిర్మాణాల పురోగతిపై మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఉన్న ఒప్పందాలను రద్దు చేసి తాజాగా మళ్లీ ఒప్పందాలను కుదుర్చుకోవాలన్నారు. ఈ నెల 11లోగా డిపిఆర్ పనులను పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పనుల అభివృద్ధిపై ఏప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షణ జరపాలని కోరారు. అదే విధంగా కెజిహెచ్ పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ సమయంలోనే బోధనాసుపత్రిలల్లో ఖాళీగా వున్న నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలని కొరుతూ ఏపి నర్సింగ్ అసోసియేషన్ సభ్యులంతా ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె వెంట డిఎంఈ డాక్టర్ ఎన్.సుబ్బారావు, కలెక్టర్ ప్రవీణ్ కూమార్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున ఉన్నారు.

చిత్రం..కెజిహెచ్‌లో రోగులతో మాట్లాడుతున్న పూనం మాలకొండయ్య