ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీ కుంభకోణం విచారణ నివేదిక ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్టవ్య్రాప్తంగా వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో జరిగిన ఆర్థిక నేరాలపై విచారణ పూర్తయి రెండు మాసాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత నివేదిక వెలుగుచూడకపోగా నేటి వరకు ఏ ఒక్క నిందితునిపై చర్య లేకపోవటం ఆశ్చర్యకరం. విశాఖపట్నానికి చెందిన ట్రెజరీ అధికారి ఒకరు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు జిల్లాలో మకాం వేసి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే విచారణ సమయంలోనే మే 24వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న గుంటూరు జిల్లా ట్రెజరీ అధికారి కె.సురేంద్రబాబును మూడు మాసాల 15 రోజుల అనంతరం సెలవు నుంచే ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. అయితే ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ కె.సదాశివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరులో ఎస్టీవో స్థాయి అధికారి ఒకరు ప్రభుత్వానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఓ మహిళ బ్యాంకు ఖాతాకు మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసినప్పటికీ ఇప్పటిదాకా ఏ ఒక్కరిపైనా చర్యలు లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. దీనికి ముందే తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ చిరుద్యోగి ఏకంగా ఒక కోటి 20 లక్షలను తన బ్యాంకు ఖాతాలకు మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ ట్రెజరీలో 5 లక్షలు మాయమైనట్లు అక్కడ ఓ కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఇలా పలువురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడటమే కాకుండా కొన్ని నిబంధనలకు విరుద్ధమైన చెల్లింపులు జరిపి ప్రభుత్వం నష్టపోయేలా వ్యవహరించారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగులకు 2010 పిఆర్‌సి బకాయిలు సుమారు కోటి 50 లక్షలు దాకా చెల్లించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన చెల్లింపులని, ఇప్పటికే గుంటూరు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇలా వరుస అక్రమాలతో ఖజానా శాఖ ప్రతిష్ఠ మంటకలుస్తుంటే ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రిత్వ శాఖలోనూ చలనం కన్పించడం లేదు. దర్యాప్తు పేరుతో అక్రమార్కులను వెనకేసుకొస్తున్నారనే అపవాదును ఈ సందర్భంగా మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాల బిల్లులు, టిఎ, డిఎ బిల్లులు, వాహనాల ఇంధన బిల్లులు, ఇతరత్రా వ్యయాలకు సంబంధించిన బిల్లులు, ఉపకార వేతనాలు తదితరాలు ఖజానా శాఖ నుంచే ఆమోదం పొందుతాయి. కంప్యూటర్ల పట్ల ఎంతో అవగాహన కల్గిన చిరుద్యోగులు పాస్‌వర్డు సంపాదించి అక్రమాలకు పాల్పడుతున్నారు.