ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాడెల్టాలో 81 శాతం నాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: కృష్ణా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు ప్రారంభించిన పథకాలు ఫలాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణా ఆయకట్టులో దాదాపు 81 శాతం వరినాట్లు పూర్తయ్యాయి. జలసిరికి హారతి కార్యక్రమం మూడురోజులపాటు జరుగుతున్న తరుణంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగటంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 11.5 అడుగుల మేరకు నీరు వచ్చింది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు కాలువలకు విడుదల చేస్తున్నారు. మొత్తం 14,601 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదిలిపెడుతున్నారు. కెఇబి కెనాల్ నుంచి 1507 క్యూసెక్కులు, బందరు కెనాల్ నుంచి 1300 క్యూసెక్కులు, ఏలూరు కెనాల్ నుంచి 1021 క్యూసెక్కులు, రైవస్ కాలువ నుంచి 4001 క్యూసెక్కులు, కెఇ మెయిన్ కెనాల్ నుంచి 7829 క్యూసెక్కులు, కెడబ్ల్యూ మెయిన్ కెనాల్ నుంచి 6,500 క్యూసెక్కులు, జిసిహెచ్ నుంచి 250 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో కృష్ణా ఆయకట్టులో వరినాట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పథకాలు ఫలితాలను అందిస్తున్నాయనటానికి కాలువల్లో నీరే ఒక ఉదాహరణ అని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తిచేయటమే కాదు.. వంద టిఎంసిల నీటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకుని వచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే దాదాపు వరినాట్లు పూర్తయ్యాయని, పంటకు సరిపడ నీటిని పూర్తిస్థాయిలో అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి నీరు రావటంతో కృష్ణా ఆయకట్టులో దిగుబడి పెరిగిందని, ఈ సీజన్‌లో కూడా మంచి ఫలితాలను రైతులు సాధిస్తారని మంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా ఆయకట్టుతో చివరి ఎకరానికి కూడా నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. దీని కోసం ప్రకృతి కూడా కరుణిస్తుందని అన్నారు. గోదావరి జలాలతో పాటు కృష్ణాజిల్లాలో కూడా కెనాల్స్‌కు సంవృద్ధిగా నీరు వస్తుందని, దీంతో కృష్ణా ఆయకట్టుకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు.