ఆంధ్రప్రదేశ్‌

‘జలసిరి’కి హారతిని స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఇదే సమయంలో కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్న ఎగువ రాష్ట్రాల్లోని అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. 300 ఏళ్ల క్రితమే బమ్మెర తన సుమతీ శతకం ద్వారా తెలిపిన నీటి ప్రాముఖ్యతను తిరిగి చంద్రబాబు ప్రచారంలోకి తీసుకురావటం హర్షణీయమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణానది నికర జలాల్లో 811 టిఎంసిలను నేడు బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రానికి ఇచ్చిందన్నారు.
తగినంత నీరు లేక రాష్ట్రంలో కృష్ణానదిపై ప్రాజెక్టులన్నీ నేడు వెలవెలపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఎగువన నిర్మితమవుతున్న అక్రమ కట్టడాలను నిలిపి వేయించాలన్నారు.