ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు డిఇఓ రామలింగం ప్రభుత్వానికి సరెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 7: నెల్లూరు జిల్లా విద్యా శాఖ అధికారి మువ్వా రామలింగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సరండర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయం సర్వ శిక్షా అభియాన్ కార్యాలయాన్ని పాఠశాల విద్యా శాఖ ఇన్‌చార్జి కమిషనర్, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు రాష్ట్ర అధికారి గుర్రాల శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాలనలో లోపాలు, పర్యవేక్షణ కొరవడటం, గతంలో గుర్తించిన లోపాలపై చర్యలు తీసుకోవడం వంటి 21 లోపాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీనివాసులు నివేదిక సమర్పించారు. జిల్లా విద్యా శాఖకు ఏటా ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు, ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలు లేవు. మెడికల్ బిల్లులు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కార్యాలయంలో వ్యక్తిగత రిజిష్టర్ సక్రమంగా లేదు. వీటిన్నిటిపై విద్యా శాఖ కమిషనర్ ప్రభుత్వానికి డిఇఓను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. ఆయన నివేదిక ఆధారంగా గురువారం డిఇఓ రామలింగంను ప్రభుత్వానికి సరండర్ చేశారు. ఇన్‌చార్జి డిఇఓగా గుంటూరు ఆర్‌జెడి శ్రీనివాసులరెడ్డిని ప్రభుత్వం నియమించింది.