ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పూర్తిచేయడమే సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రాష్ట్రంలో కరవును పారదోలడమే జలసిరికి పూజా సంకల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నా రు. గోదావరి నది రాష్ట్రానికి జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తానని, అదే తన సంకల్పమన్నారు. జలసిరి హారతిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదికి హారతి ఇవ్వడం పూర్వజన్మ సుకృతమన్నారు.
గోదావరి, కృష్ణ నదులు మన రాష్ట్రంలో ఉండటం అదృష్టమన్నారు. రెండు పుష్కరాలు నిర్వహించే అదృష్టం తనకు దక్కిందన్నారు. గంగాహారతి మాదిరిగానే గోదావరి నది హారతి గత పుష్కరాల నుంచి ప్రవేశపెట్టి అపుడే కరవును పారదోలాలని సంకల్పించామన్నారు. ఆ సంకల్పం మేరకు నదుల అనుసంధానంతో పట్టిసీమ పథకంతో కృష్ణా ఆయకట్టు కష్టాలు తొలగించామన్నారు. రూ.9000 కోట్ల సంపదను గోదావరి జలాల ద్వారా కృష్ణా ఆయకట్టులో సృష్టించామన్నారు. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని పోలవరం ప్రాజెక్టు ప్రారంభించేలోపు సద్వినియోగం చేసుకోవడానికి గోదావరి జిల్లాల ప్రజలు సహకరించడంతో కృష్ణాకు మేలు జరిగిందన్నారు. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరుకు పూర్తిగా నీరిస్తామని, మెట్ట ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 800 టిఎంసిల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. జలసిరికి హారతివ్వడమంటే ప్రకృతిని పూజించడమేనని, ప్రకృతని పూజించే సంస్కృతి కొనసాగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 28 ప్రాజెక్టులను మూడు నెలల్లో, 13 వేల కోట్లతో పూర్తి చేయనున్నామన్నారు. కరువు నివారణే సంకల్పంగా పనిచేస్తున్నామని, నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి అందించే పథకం త్వరలో ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్న క్యాంటీన్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తామన్నారు.
ఉద్యోగాల కోసం యువత నైపుణ్యం పెంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా చేస్తానన్నారు. నాణ్యమైన చదువుకు రాష్ట్రాన్ని చిరునామాగా చేస్తానన్నారు. ముఖ్యమంత్రి ముందుగా గోదావరి మాత విగ్రహం వద్ద హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రికి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. గోదావరి నదికి వేదపండితులు ఇచ్చిన హారతిని ముఖ్యమంత్రి తిలకించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన మండలి ఛైర్మన్ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపి మాగంటి మురళీమోహన్, డిజిపి సాంబశివరావు, మేయర్ పంతం రజనీ శేషసాయి, తూ.గో. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..జలసిరికి హారతి గోదావరికి సమర్పించడానికి పట్టువస్త్రాలు తీసుకువస్తున్న సిఎం చంద్రబాబు