ఆంధ్రప్రదేశ్‌

ఎత్తిపోతలలో మేఘా మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్మాణ నిర్వహణలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ రికార్డు నెలకొల్పింది. పట్టిసీమ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి (కెసి కాలువ) ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసిన సంస్థ ఇప్పుడు ముచ్చుమర్రి (హంద్రీ-నీవా సుజల స్రవంతి) వద్ద మరో స్కీంను పూర్తిచేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామం వద్ద హంద్రీ-నీవా సుజల స్రవంతి మొదటి దశ రెండో ప్యాకేజీలో భాగంగా మేఘా సంస్థ నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనివల్ల రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు 33లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ద్వారా 40 టిఎంసిలను ఈ ఎత్తిపోతల పథకం ద్వారా తరలిస్తారు. ఈ పథకంలో భాగంగా పంప్‌హౌస్, నీటి సరఫరా వ్యవస్థ, పంప్‌లు, మోటార్లు మొదలైన వాటిని ఏర్పాటు చేసింది. 3.7 మెగావాట్ల పంపులను ఏర్పాటుచేశారు.