ఆంధ్రప్రదేశ్‌

పోలీసు ఉద్యోగం పెత్తనానికి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలీసు ఉద్యోగం అంటే పెత్తనం చేయడం కాదని, ప్రజలతో స్నేహంగా మెలుగుతూ ఆ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూ. 14కోట్లతో నిర్మించిన రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న 181 మంది మహిళా ఎఆర్ కానిస్టేబుళ్లను ఉద్దేశించి సిఎం ప్రసంగించారు. నేరంచేస్తే చొక్కా పట్టుకునే విధంగా పోలీసులు వ్యవహరించాలన్నారు. అన్ని వృత్తుల కన్నా పోలీసు ఉద్యోగం ఉత్తమమైనదని, మహిళలు ఈరంగంలో ఆత్మగౌరవంతో జీవించవచ్చన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సిసి కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటికే స్మార్ట్ పోలీసుస్టేషన్లను ప్రారంభించామని, స్మార్ట్ కార్యాలయాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీలో కూడా కండక్టర్లు, డ్రైవర్లుగా మహిళలకే ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పురుషుల కన్నా మహిళలు వృత్తి పట్ల అంకితభావంతో, నిజాయితీగా ఉంటారని ఆయన కితాబిచ్చారు. తాను కళాశాలలను సందర్శించినపుడు విద్యార్థినులు ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాల పట్ల ఆసక్తి కనపరిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరెండు రంగాల్లో పేదలకు సేవ చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారన్నారు. నేడు మహిళలకు కట్నాలు ఎదురిచ్చే రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించారన్నారు. ఎస్పీ కార్యాలయ నిర్మాణ శైలిని సిఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.3.48లక్షలతో నిర్మించిన సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సుమారు అరగంట పాటు ఎస్పీ కార్యాలయంలోని అన్ని విభాగాలను సిఎం పరిశీలించారు. సిఐడి విభాగాన్ని ఆధునీకరించడానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని సిఎం హామీ ఇచ్చారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మండలి చైర్మన్ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, డిజిపి ఎన్ సాంబశివరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు, ఐజి కుమార్‌విశ్వజిత్, డిఐజి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, మున్సిపల్ కమిషనర్ వి విజయరామరాజు, మేయర్ రజనీశేషసాయి, ఎంపి మురళీమోహన్, జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం..శిక్షణ పొందుతున్న మహిళా కానిస్టేబుళ్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు