ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రవరం కార్పొరేషన్ కొత్త భవనం ప్రారంభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: అత్యాధునిక రీతిలో రూ. 20కోట్లతో నిర్మించిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన భవనాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన 33కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా లిఫ్టు ద్వారా వెళ్లి కౌన్సిల్‌హాలు, కమాండ్ కంట్రోల్‌రూమ్, మేయర్ ఛాంబర్లను పరిశీలించారు. భవనం సెల్లార్‌లో నెలకొల్పిన గౌతమ బుద్ధు డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, కమిషనర్ వి విజయరామరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎస్పీ బి రాజకుమారి పాల్గొన్నారు. తొలుత రాజమహేంద్రవరం కౌన్సిల్ ఏర్పడి 150ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మించిన పైలాన్‌ను సిఎం ఆవిష్కరించారు.

చిత్రం..నూతన భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సిఎం