ఆంధ్రప్రదేశ్‌

జ్వరమని వెళితే చూపు పోగొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: జ్వరం వచ్చిందని రెండేళ్ల పిల్లాడిని కెజిహెచ్‌లో చేర్చితే, నెల రోజుల వరకూ జ్వరం తగ్గించకపోగా, పిల్లాడి చూపు పోగొట్టి, ఇంటికి పంపించారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన రెండేళ్ల పిల్లాడు సిద్దూకు నెల రోజుల కిందట జ్వరం వచ్చింది. స్థానిక వైద్యులు సిద్దూకు టిబి సోకిందని చెప్పారు. దీంతో సిద్దూను కేజిహెచ్‌లో చేర్చారు. నెల రోజుల నుంచి వైద్యలు అంతంత మాత్రంగానే వైద్యం అందిస్తున్నారు. వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా హైడోస్ మందులు ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు మంగళవారం నుంచి జ్వరం తగ్గుముఖం పట్టింది. డిస్చార్జ్ చేసిన తరువాత ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో సిద్దూ ఎవరినీ గుర్తు పట్టలేకపోవడాన్ని బాలుడి తల్లిదండ్రులు గమనించారు. కేవలం మాట్లాడిన మాటలను బట్టి ఫలానా అని గుర్తు పట్టే పరిస్థితికి వచ్చాడు. వెంటనే సిద్దూ తల్లిదండ్రులు సమీపంలోని కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సిద్దూను పరీక్షించి, హైడోస్, లేదా నకిలీ మందులు వాడడం వలన కంటి చూపు పోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ ఎక్కడ వైద్యం చేయించారో, అక్కడికే తీసుకెళ్లమని కంటి డాక్టర్లు సూచించారు. వెంటనే సిద్దూను కేజిహెచ్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించిన విభాగంలో పరిస్థితిని వివరించారు. అయితే అక్కడి డాక్టర్లెవరూ సరైన రీతిలో స్పందించకపోవడంతో కేజిహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిద్దూ తల్లిదండ్రులు మాట్లాడుతూ కేజిహెచ్ వైద్యులు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని, తమ పట్ల అవహేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా, సిద్దూ కేస్ షీట్‌ను కూడా చించేసి తమను బయటకు పంపించారని సిద్దూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం..కంటి చూపు కోల్పోయిన సిద్దూతో కెజీహెచ్ వద్ద ధర్నా చేస్తున్న తల్లి