ఆంధ్రప్రదేశ్‌

చారిత్రక ఆనవాళ్లు పరిరక్షించాలన్నాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 7: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని చాలాకాలం తరువాత దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేత నేపథ్యంలో ఆ మండపాన్ని యధాస్థానంలో నిర్మించేంత వరకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోనని చిన్నజీయర్ స్వామి ప్రతిజ్ఞ చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో ఆరేళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి తిరుమలకు వచ్చినా స్వామివారి దర్శనం చేసుకుకోకుండానే వెనుతిరిగారు. బుధవారం తిరుమలకు చేరుకున్న ఆయన గురువారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద తిరుమల, తిరుపతి జెఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, అర్చకులు ఆలయ మర్యాదలైన ఇస్తికపాల్‌తో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా పది నిమిషాలపాటు స్వామివారిని దర్శించుకున్న చిన్నజీయర్ స్వామి ఆలయ అర్చకులతోను, ఓఎస్డీ శేషాద్రితోను, అధికారులతోను ఎంతో ఉల్లాసంగా సంభాషించారు. అంతేకాకుండా ఆలయం ముందు స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులకు కూడా ఆయన ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వెయ్యికాళ్ల మండపానికి సంబంధించి చేసింది పోరాటం కాదని, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను పరిరక్షించుకోవడానికే నాడు తాను ప్రశ్నించానని చెప్పారు. చరిత్ర ఒకరి సొత్తుకాదని, ప్రపంచంలో ఉన్న అందరి సొత్తు అన్నారు. అది ప్రపంచానికి చాటి చెప్పాలని సంకల్పించామని, అదే చేశామన్నారు. ఆ సమయంలో టిటిడి అధికారులు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. వెయ్యికాళ్ల మండపానికి సంబంధించి జరగాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు జరగాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన నవ్వుతూ చెప్పారు. చాతుర్మాస వత్రాన్ని పూర్తి చేసుకుని వేంకటేశ్వర స్వామిని సేవించుకునే అదృష్టం తనకు లభించడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో స్వామివారి కైంకర్యాలకు సంబంధించి రామానుజాచార్యుల పాత్ర ఎంతో ఉందన్నారు. శ్రీరంగ క్షేత్రం, తిరుమల, మేల్‌కోట, కాంచిపురం క్షేత్రాలు రామానుజాచార్యుల చరిత్రతో ఎంతో అనుబంధం ఉన్నాయన్నారు. అందులో ముఖ్యంగా తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. తిరుమలలో వెలసి ఉన్నది ఎవరు అన్న సంశయం ఉన్న రోజుల్లో రామానుజాచార్యులు తిరుమలకు వేంచేశారన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో వెలసివున్న సాక్షాత్తు పద్మావతి నాథుడైన వైకుంఠంలో శ్రీపతని నిరూపణ చేసిన మహనీయుడు రామానుజాచార్యులని ఆయన వెల్లడించారు. వాటిని అంగీకరింప జేయడానికి స్వామివారికి అనేక ఆభరణాలను పెడితే తెల్లవారేలోపు శంఖు చక్రాలు ధరించాడని, అవి ఎవరి ద్వారా అయినా అందిస్తేనే ఒక పవిత్రత ఏర్పడుతుందని రామానుజాచార్యుల ద్వారా స్వామివారు స్వీకరించారని పురాణాలు ఉటంకిస్తున్నాయన్నారు. ఆవిధంగా సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి రామానుజాచార్యులను ఆచార్యులుగా స్వీకరించారని చరిత్ర చెబుతోందన్నారు. ఆయన ఆదేశాల మేరకే అనంతాచార్యులు తిరుమలలో ఉంటూ పుష్పకైంకర్యం చేసి ఆలయ నిర్వహణను కూడా చేపట్టారన్నారు.

చిత్రం.. శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతున్న చిన జీయర్ స్వామి