ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ స్థాయి ఆసుపత్రులు మనకే సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: మరో రెండేళ్ల నాటికి ఎఎఐఎంఎస్ సంస్థ ఆధ్వర్యంలో తొలిదశలో భాగంగా 300 పడకల ఆసుపత్రితో మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వైద్య విద్యా రంగంలో ఏపి రాజధాని అమరావతిని ప్రథమ స్థానంలో నిలపడంలో ప్రపంచస్థాయి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో గురువారం అమరావతి అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్(ఎఎఐఎంఎస్) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాజధానిలో లేని విధంగా మన రాజధాని అమరావతి ప్రాంతంలో వైద్య విద్యారంగంలో 21 ప్రముఖ సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆర్థికంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అయినా ప్రజల మద్దతు, సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ముందడుగు వేశామన్నారు. ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత, బిఆర్ శెట్టి, ఇండో-యుకె వంటి అత్యున్నత స్థాయి వైద్య విద్యాసంస్థలను, యూనివర్సిటీలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి 1995 ప్రాంతంలో మద్దతు ఇస్తే, ఆనాడు తన చర్యలను తప్పుపట్టారన్నారు. అప్పట్లో 30 మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను 300కు పెంచానని, ఇక్కడ విద్య నేర్చుకున్నవారు విదేశాల్లో స్థిరపడటం ద్వారా రాష్ట్రానికి ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నించారు. ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు ఉంటే ఆ నలుగురిలో ఒకరు తెలుగువారు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇతర దేశాలకు వెళ్లడం ద్వారా వారి విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడంతోపాటు సంపాదనను సృష్టించగలుగుతారన్నారు. వారు సంపాదించిన కష్టార్జితంతో జన్మభూమికి వచ్చి ఇక్కడ పరిశ్రమలు, ఆసుపత్రులు పెట్టడం ద్వారా రాష్ట్భ్రావృద్ధిలో తప్పనిసరిగా భాగస్వామ్యం అవుతారన్నదే తన ఆలోచన అన్నారు. తద్వారా ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. దేశంలో ఎన్నో రాజధానులు నూతన రాష్ట్రాల్లో ఏర్పాటైనా వాటి పురోగతిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయన్నారు. వాటికి భిన్నంగా ఏపి రాజధాని నిర్మాణం ప్రపంచస్థాయి రాజధానిలో ఒకటిగా ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన విధానంతో చర్యలు చేపడుతోందన్నారు. ఎఎఐఎంఎస్ సంస్థను మూడు దశల్లో రూ.600 కోట్ల వ్యయంతో 12 వందల పడకలతో పూర్తిచేస్తారన్నారు. తొలిదశలో 300 పడకలతో కూడిన ఆసుపత్రి 2019 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెండు, మూడు దశల్లో మిగిలిన అభివృద్ధి పనులు సాగుతాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఈ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇదే సందర్భంలో అమెరికా వంటి దేశాల ప్రజలకు ఈ ప్రాంతంలోనే వైద్య సేవలను అందించే దిశలో అడుగులు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవిస్తారనే తలంపుతో వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నామన్నారు. పిహెచ్‌సి స్థాయి వరకు వైద్య సేవలు, వైద్య పరీక్షలను పేద ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇక శ్రీశైలం కాలువ ద్వారా ఇప్పటికి 4.5 టిఎంసిల నీరు మాత్రమే వచ్చిందన్నారు. జలసంరక్షణా చర్యల్లో భాగంగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం కోసం పట్టిసీమ ద్వారా తను చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇవ్వడంతో కృష్ణాడెల్టా పంటలను కాపాడుకోగలిగామన్నారు. జలసిరికి హారతి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం కావాలన్నారు. శాటిలైట్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించడంతోపాటు ఇక్కడ విద్యార్థులకు ఉత్తమ అభ్యాసం వైద్య రంగంలో అందించడం సాధ్యమవుతోందన్నారు.

చిత్రం..ఎఎఐఎంఎస్ శంకుస్థాపన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు