ఆంధ్రప్రదేశ్‌

మీ సన్మానానికి కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: ‘ఆగస్ట్ 26న నేను అమరావతి వచ్చిన సందర్భంగా నాకు మీరు, మీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు ప్రజలు అపూర్వ రీతిలో చేసిన పౌర సన్మానం ఎన్నటికీ మరువలేనిది. గన్నవరం విమానాశ్రయం నుంచి 26 కిలోమీటర్ల దారి పొడవునా వేలాది మంది విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు, దృశ్యాలు నాకు ఎప్పుడూ మనఃపథం నుంచి చెరిగిపోవని’ ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు స్వదస్తూరితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. నేను పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ చివరి సంతకం చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సచివాలయం వద్ద ఇళ్ల పథకం పైలాన్‌ను నాతో ఆవిష్కరింపచేయడం నాకు ఆనందం కలిగించింది. నేను రాజ్యాంగ పదవిలో ఉన్నా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నా తెలుగు నేలను, తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేను. రాష్ట్భ్రావృద్ధికి నా పరిధిలో నాకు సాధ్యమైనంత కృషి చేస్తానని, సలహాలు, సహకారం అందిస్తానని పునరుద్ఘాటిస్తున్నాను. మీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని విశ్వసిస్తున్నానని శుభాకాంక్షలు తెలిపారు.