ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ఎవరు పార్టీలోకి వచ్చినా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని, తామంతా సైనికుల్లా పనిచేస్తున్నామన్నారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ నాయకుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా బలపరుస్తామన్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి లోగడ తెలుగుదేశం పార్టీ విడిచి వెళ్లారని, వారిని పార్టీలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే తాను దాన్ని స్వాగతిస్తానన్నారు. ఆరోగ్య కారణాల వల్ల కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు.