ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా రచయితల సంఘ పురస్కారాలకు 10 మంది ప్రముఖులు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: వివిధ సాహితీ ప్రక్రియల్లో విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖులకు కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రతి ఏటా అందించే పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ సాయంత్రం హోటల్ ఐలాపురంలో జరగనుంది. ఈ సందర్భంగా 2016 - 2017 సంవత్సరాలకు గాను పది మంది ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసినట్టు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జివి పూర్ణచంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తన తండ్రి వెంకట కృష్ణారావు పేరిట ఏర్పాటు చేసిన పురస్కారానికి శలాక రఘునాథ శర్మ (2016), ఎస్.గంగప్ప (2017) ఎంపికయ్యారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆలూరి బైరాగి సాహిత్య పురస్కారానికి రసరాజు, ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, గుత్తికొండ సుబ్బారావు ఏర్పాటు చేసిన సాహితీ సేవా పురస్కారానికి కలనాధభట్ట వీరభద్ర శాస్ర్తీ, దంటు సూర్యారావు, ఆచార్య ప్రతిభ ఏర్పాటు చేసిన ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారానికి ఈడ్పుగంటి నాగేశ్వరరావు, డోలేంద్ర, గోళ్ల నారాయణరావు ఏర్పాటు చేసిన పోలవరపు కోటేశ్వరరావు కథా పురస్కారానికి పి.సత్యవతి, కనె్నగంటి అనసూయ ఎంపికయ్యారు.