ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌టిటిపిఎస్‌కు బొగ్గు కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: బొగ్గు కొరతతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు ధర్మల్ విద్యుత్ స్టేషన్‌లో గత కొద్ది రోజులుగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతూ శుక్రవారం నాటికి దారుణంగా పడిపోయింది. అదృష్టవశాత్తు భారీ వర్షాల వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఉంది. అదనపు బొగ్గు సరఫరా కోసం ఎన్‌టిటిపిఎస్ ఇంజనీర్లలో కొందరు ఆగమేఘాలపై మణుగూరుకు, మరికొందరు మహారాష్టల్రోని మహానంది వైపు పరుగులు తీశారు. ఎన్‌టిటిపిఎస్‌లో మొత్తం ఏడు యూనిట్లు ఉన్నాయి. 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల్గిన ఆరు యూనిట్లు ఉంటే ఏడో యూనిట్‌కు 500 మెగావాట్ల సామర్థ్యం ఉంది. మొత్తంపై 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా శుక్రవారం ఏడు యూనిట్లు పనిచేసినప్పటికీ 900 మెగావాట్లకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రం మొత్తంపై 2300 మెగావాట్ల పవన విద్యుత్, 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే కొద్ది రోజులుగా పవన విద్యుత్ ఉత్పాదకత 60 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో బొగ్గు నిల్వలు తరిగిపోవటంతో గత్యంతరం లేని స్థితిలో ఎన్‌టిటిపిసిలో నిత్యం ఒకటి, రెండు యూనిట్లను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఓవరాయిలింగ్ వంటి స్వల్ప మరమ్మతులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 25వేల టన్నుల బొగ్గు అవసరం కాగా ప్రస్తుతం 80వేల టన్నులకు మించి నిలువలేదు. ఈ కారణంతో క్రమేణా విద్యుత్ ఉత్పత్తిని కుదించాల్సి వస్తున్నది. సాధారణంగా రోజూ మణుగూరు సింగరేణి కాలరీస్ నుంచి రెండు రేకులు, మహానంది సమీపంలోని తాల్చేరు నుంచి ఓడలో విశాఖకు తిరిగి అక్కడ నుంచి రైలుమార్గాన ఆరు రేకుల్లో బొగ్గు దిగుమతి అవుతుంటుంది. భారీ వర్షాల కారణంగా పై రెండుచోట్ల బొగ్గు తవ్వకాలు నిలిచి గత కొద్ది రోజులుగా సరఫరా నిలిచిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంజనీర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు సరఫరా జరిగేలా సమాలోచనలు సాగిస్తున్నారు. బొగ్గు సరఫరాలో జాప్యం జరిగితే అన్ని యూనిట్లు కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది.