ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు ఎఆర్ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 8: గుంటూరు రూరల్ ఎఆర్ పోలీసు సిబ్బందికి ప్రతి సోమవారం వారాంతపు సెలవు అమలు చేయనున్నట్లు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పలనాయుడు తెలిపారు. గుంటూరు నగరంలోని పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీసు దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒక రోజు కల్చరల్ ఈవెంట్స్, క్రీడలు నిర్వహిస్తామన్నారు. మొదటగా సిబ్బందికి మిస్టర్ గుంటూరు పేరిట బాడీ బిల్డింగ్ పోటీలను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సిబ్బంది విశ్రాంతి కొరకు డార్మటరీని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అలాగే వాహనాలు నిలుపుకునేందుకు స్టాండ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తనకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. పోలీసు సిబ్బంది దుర్వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని, అలాగే పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావద్దని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్‌పి సూరిబాబు, ఎఆర్ డిఎస్‌పి సత్యనారాయణ, ఓఎస్‌డి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.