ఆంధ్రప్రదేశ్‌

ఐవైఆర్ వ్యాఖ్యలు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 8: ప్రజల సహకారంతో నిర్మిస్తున్న ప్రజా రాజధానిపై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. జగన్‌కు అద్దె మైకులా ఐవైఆర్ వ్యవహరిస్తున్నారని, రేపో, మాపో వైసిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఆయన దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విజయవాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనంద్ సూర్య మాట్లాడుతూ 24వేల మంది రైతులు రాత్రింబవళ్ళు క్యూలో నిలబడి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే బెదిరించి లాక్కున్నారని మాట్లాడటం రైతులను అవమానించినట్లేనన్నారు. 2015లో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైనప్పుడు మీరు ప్రభుత్వంలో లేరా.. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. లోటస్‌పాండ్ నుంచి వచ్చే డైరెక్షన్‌లోనే ఐవైఆర్ నడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలనకు నంద్యాల, కాకినాడ ప్రజలు బ్రహ్మరధం పట్టిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ జీర్ణించుకోలేని ఐవైఆర్ కృష్ణారావు తన అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. నిన్నటి వరకు ప్రభుత్వంలో ఉండి మాట్లాడని కృష్ణారావు ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ తన గౌరవం తానే మంటగలుపుకుంటున్నారని, ఇప్పటికైనా ఆయన హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పిఆర్‌ఓ ఈమని సూర్యనారాయణ, కార్పొరేటర్ గుండూరి మహేష్, నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.