ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ సిబ్బందికి సొంత ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 8: పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సొంత ఇళ్ల నిర్మాణానికి తగుచర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) నండూరి సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అనేక ఒత్తిళ్లను తట్టుకుని విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిలో చాలామందికి సొంత ఇళ్లు లేవని, ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి భరోసా కల్పించడానికి సొంత ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సొంత ఇళ్లు లేని వారికి ఇళ్ళు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 1800 నుండి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని విశాఖపట్టణంలో సిబ్బందికి బ్యాటరీలతో నడిచే వాహనాలను అందజేసినట్లు డిజిపి సాంబశివరావు వివరించారు. కోస్తాతీరం వెంబడి సిబ్బందికి ద్విచక్ర వాహనాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. నేరాలు అదుపుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పోలీస్ సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని డిజిపి వివరించారు. దీనికోసం కడియం నర్సరీలతో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 40మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, ఈసంవత్సరం మరో వంద మోడల్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.