ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 8: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే ఎన్నికలు పూర్తయినప్పటికీ, మేయర్ ఎన్నికపై కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్ధ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదలచేశారు. ఈనెల 12వ తేదీలోగా గెలుపొందిన కార్పొరేటర్లకు సమాచారమివ్వాలని, వారందరినీ సమావేశపరిచి, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాలని సూచించారు. 16వ తేదీన ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థలోని 50 డివిజన్లకుగాను ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టిడిపి-బిజెపి కూటమికి 35 డివిజన్లు, వైసిపికి 10 డివిజన్లు లభించగా, స్వతంత్రులు మూడు డివిజన్లలో విజయం సాధించారు. జనరల్ మహిళకు కేటాయించిన ఈ పదవిని కాపు సామాజికవర్గానికి కేటాయిస్తామని ఎన్నికల ముందు టిడిపి ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయం సాధించిన వారిలో నలుగురు మహిళా కార్పొరేటర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.