ఆంధ్రప్రదేశ్‌

ప్రాచీన వైద్యన్ని బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 8: ప్రాచీన వైద్యాన్ని బలోపేతం చేస్తూ త్వరలో ఎపి, తమిళనాడులో విదేశీ సంస్థల సాయంతో అంతర్జాతీయ స్థాయి ఆయుష్ ఆసుపత్రులు నిర్మిస్తామని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ అన్నారు. కేంద్ర ఆయుష్ శాఖ, ప్రోగ్రస్ హార్మోని డెవలప్‌మెంట్(పిహెచ్‌డి)ల సంయుక్త ఆధ్వర్యంలోవిశాఖ ఎయు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ ఆరోగ్యమేళా-2017ను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ వైద్య విధానాన్ని ప్రజలల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఆయుర్వేదం, యునాని, నేచురోపతి, యెగా పట్ల గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దేశంలో మధుమేహం, హైపర్‌టైన్ష్‌న్, పలు దీర్ఘకాలిక వ్యాధులు బాగా వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నియంణ్రకు యెగా, దేశీయ వైద్యం ఉపకరిస్తాయన్నారు. విశాఖ ఎంపి కె.హరిబాబు మాట్లాడుతూ తూర్పుకనుమల్లో ఉన్న వన, ఔషధ మూలికల ద్వారా నేచురోపతి, ఆయుర్వేద మందులు తయారు చేసే అంశాన్ని పరిశీలనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏపి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ సుజాత శర్మ, పిహెచ్‌డి చాంబర్ ఉపాధ్యక్షుడు అనిల్ ఖేతన్, నిర్వహకులు తదితరలు పాల్గొన్నారు. అనంతరం ఆయుష్ శాఖ, పలు ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి, ఎంపి ప్రారంభించారు.