ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ఫిజియోథెరపీ కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో త్వరలోనే ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ఫిజియోథెరపిస్ట్‌ల ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ ఫిట్‌నెస్‌గా ఉండటానికి ఫిజియోథెరపిస్టులు కృషి చేయాలన్నారు. ఆపరేషన్ తర్వాత రోగికి ఉపశమనం లభించే విధంగా ఫిజియోథెరపిస్టులు అందించే సేవలు మరువలేనివన్నారు. చాలా సందర్భాల్లో ఎలాంటి మందులు అవసరం లేకుండానే కేవలం ఫిజియోథెరపిస్టుల ద్వారా రోగికి ఉపశమనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదవారికి మంచి ఆరోగ్యం అందించటానికి ప్రభుత్వం అన్నివేళలా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఒక హెల్త్ సొసైటీగా తయారుచేయటానికి ఫిజియోథెరపిస్టులు ప్రధాన పాత్రను పోషించి, వైద్య సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. గతంలో ప్రభుత్వాల వైఫల్యంతో పోలియో వ్యాధి బారిన పడిన సందర్భంలో ఫిజియోథెరపిస్టులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. నేటి క్రీడల్లో కూడా ఫిజియోథెరపిస్టులు మరువలేని కీలకపాత్ర పోషిస్తున్నారు. తాను 208 రోజులపాటు పాదయాత్ర చేసి న సమయంలో ఫిజియోథెరపిస్టు అమోఘంగా సేవలు అందించారన్నారు. రాష్ట్రంలో 2,811 కిలోమీటర్లు పర్యటించి విశాఖపట్నం వరకు నడిచానన్నారు. ఆ సందర్భంలో తనకు వచ్చిన కాలినొప్పులు భవిష్యత్తులో కూడా పునరావృతం అవుతాయని డాక్టర్లు హెచ్చరించారన్నారు.
తొలుత వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు, తదితరులు ప్రారంభించారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ శస్తచ్రికిత్స తర్వాత ఫిజియోథెరపిస్టుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. కౌన్సిల్ సాకారం అవ్వడం వల్ల రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టుల ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.

చిత్రం.ఫిజియో థెరపిస్టుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు