ఆంధ్రప్రదేశ్‌

గరిష్ఠ స్థాయికి డొంకరాయి నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, సెప్టెంబర్ 8: డొంకరాయి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో శుక్రవారం సాయంత్రం నుంచి జెన్‌కో అధికారులు మూడు వేల క్యూసెక్కుల నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నామని ఎస్‌ఇ మురళీమోహన్ తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు డొంకరాయి రిజర్వాయర్‌లో వరద నీరు తాకిడి పెరగడం, సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రానికి డొంకరాయి రిజర్వాయర్‌లో 1036.9 అడుగులకు నీటిమట్టం చేరిందన్నారు. డొంకరాయి పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా, 0 పాయింట్ ఒక అడుగు పెరిగితే పూర్తిస్థాయికి చేరుతుందని, వరద నీటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 1035.5 అడుగులు నీటిమట్టం తగ్గే వరకు విడుదల చేస్తామని ఎస్‌ఇ మురళీమోహన్ తెలిపారు.