ఆంధ్రప్రదేశ్‌

అమరావతి ‘రియల్’దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాజధాని ముసుగులో ఎపి సిఎం చంద్రబాబునాయుడు చేస్తున్న రియల్ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాజధాని నిర్మాణంపైనా శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణల్లో నిజా నిజాలను నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణ చేపట్టాలని అన్నారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి సరైనది కాదని శివరామకృష్ణ కమిటీ సూచనలు చేసింది వాస్తవమేనని ఆ కమిటీలో కన్వీనర్‌గా వ్యవహరించిన ఐవైఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాజధానిలో చంద్రబాబు 9 నగరాలను నిర్మిస్తానని చెప్పి రైతుల నుంచి భూములు లాక్కున్నారని, ఆ నగరాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని అన్నారు. రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. 2018నాటికి రాజధాని తొలిదశ పూర్తవుతుందని చెప్పారని, ఎక్కడ జరిగిందని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. క్యాట్ కేసులు నడుస్తున్న చెరుకూరి శ్రీధర్‌ను సిఆర్‌డిఏ కమిషనర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు.