ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి అడ్రస్ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష వైకాపాకు అడ్రస్ లేకుండా ఫుల్ స్వీప్ చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన నంద్యా ల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో 2019 ఎన్నికల్లో టిడిపిదే విజయం అని అర్థం అవుతోందన్నారు. కాకినాడలో వైసిపిని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలనుకున్నా సాధ్యం కాలేకపోయిందన్నారు. కృష్ణాడెల్టాకు నీటి కొరత లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. నగర వాసులకు మంచినీరు అందించే స్థానిక విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద శుక్రవారం జరిగిన జలసిరికి హారతి కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ‘రాయలసీమలో సిఎం ఒకపక్క.. ప్రతిపక్షనేత మరోపక్క ఉన్నారు.. పట్టిసీమ వద్దన్న ఏకైక వ్యక్తి ప్రతిపక్ష నేత జగన్ మాత్రమే’ అన్నారు. జలమే జీవనమని, నీటి సంరక్షణతోనే భావి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దగలుగుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం తో స్థానికంగా ఉండే జల వనరుల వద్దకు చేరుకుని జలసిరికి హారతి ఇస్తున్నారన్నారు. దేశంలోనే ప్రథమంగా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సిఎం నాయకత్వం లో శ్రీకారం చుట్టిందన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయడం ద్వారా కృష్ణాడెల్టాలోని పంటలను కాపాడుకోగలిగామన్నారు.

చిత్రం.జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్