ఆంధ్రప్రదేశ్‌

సహకార బ్యాంక్‌లు బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మార్కెటింగ్, సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టంచేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏర్పడి నూరు వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని బ్యాంక్ ఆవరణలో శత వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ సహకార బ్యాంక్‌ల బలోపేతానికి గాను ప్రభుత్వం తరపున సహకార బ్యాంక్‌ల్లో డిపాజిట్లు చేస్తామని వెల్లడించారు. నష్టాల్లో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను లాభాలబాట పట్టించిన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల సహకార బ్యాంక్‌లకు ఆదర్శంగా నిలవాలని అభిలషించారు. రాష్ట్రంలో 43వేల కోట్ల నిధులతో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. పుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పేరిట బృందంగా ఏర్పడితే ప్రభుత్వం తరపున 50 శాతం సబ్సిడీతో రూ.కోటి వరకూ ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ 2014లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాక తొలుత ఇరిగేషన్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు మాట్లాడుతూ సన్నకారు, చిన్నకారు రైతులకు సహాయం అందించేది సహకార బ్యాంకులు మాత్రమేనన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.