ఆంధ్రప్రదేశ్‌

మన్యంలో మావోల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, సెప్టెంబర్ 8: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. ఒకేసారి నాలుగు పొక్లయిన్లను దగ్ధం చేసి మన్యంలో సంచలనానికి తెరలేపారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో కేబుల్ వేసేందుకు గోతులు తవ్వుతున్న పొక్లయిన్లను మావోయిస్టులు గురువారం రాత్రి దగ్ధం చేశారు. నుర్మతి పంచాయతీ వాకపల్లి సమీపాన ఉన్న రెండు పొక్లయిన్లను ముందుగా దగ్ధం చేసిన మావోయిస్టులు నుర్మతిలో ఉన్న మరో రెండింటిని కూడా తగులబెట్టారు. సాయుధులైన నలుగురు మావోయిస్టులు గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో వాకపల్లి సమీపాన పనులు చేస్తున్న ప్రదేశానికి చేరుకుని తమ వెంట తెచ్చిన పెట్రోలు పోసి వీటిని తగులబెట్టారు. ఈ పొక్లయిన్లకు చెందిన డ్రైవర్లు అక్కడికి సమీపాన ఒక గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ పడుకున్నారు. మావోయిస్టులు పొక్లయిన్లు దగ్ధం చేసిన సమయంలో ఎవరూ లేరని తెలుస్తోంది. వాకపల్లి గ్రామం వద్ద పొక్లయిన్లను దగ్ధం చేసిన తరువాత మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న నుర్మతి గ్రామానికి మావోయిస్టులు కాలినడకన వెళ్లి నుర్మతిలో ఉన్న మరో రెండింటికి నిప్పు పెట్టారు. అయితే ఈ పొక్లయిన్లలో డ్రైవర్లు నిద్రపోతుండగా వారిని లేపి మరీ దేహశుద్ధి చేసారు. అనంతరం వాటికి నిప్పు పెట్టి పూర్తిగా దగ్ధమయ్యే వరకు మావోయిస్టులు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా ఈ సారి మావోయిస్టులు వ్యవహరించడం ఈ సందర్భంగా గమనార్హం. గతంలో నిప్పు పెట్టి మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి జారుకునేవారు. అయితే ఈ సారి మాత్రం అవి పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉండడం విశేషం. నుర్మతి, మద్దిగరువు గ్రామాల్లో సెల్ టవర్ నిర్మాణ పనులను నిరసిస్తూ ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. నుర్మతిలో చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని వారం రోజుల క్రితం మావోయిస్టులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల హెచ్చరికలతో సెల్ టవర్ నిర్మాణ పనులను కూలీలు నిలిపివేసి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలియని పొక్లయిన్ల డ్రైవర్లు తమ పనిని యధావిధిగా చేసుకుంటూ కేబుల్ వేసేందుకు వీలుగా గోతులు తీసే పనిని చేపడుతున్నారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు నాలుగు పొక్లయిన్లను దగ్ధం చేసినట్టుగా చెబుతున్నారు.

చిత్రం..మావోయిస్టులు తగులబెట్టిన ప్రొక్లయిన్లు

ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టులు ఆగవు
ప్రజల మంచి కోసం ఏ పనైనా చేస్తా ఔ ఉరవకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజల మంచి కోసం ఏ పనైనా చేస్తా ఔ ఉరవకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబుఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 8: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో చేపట్టిన నీటి ప్రాజెక్టుల పనులు ఆగవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా హెచ్చెల్సీకి విడుదల చేసిన తుంగభద్ర జలాలకు బాబు హారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం తాను అహర్నిశలు శ్రమిస్తున్నానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ కోర్టులకు వెళ్లరని. అయినా కొందరు రాష్ట్భ్రావృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే ఆ పని తప్పక చేస్తానని స్పష్టం చేశారు. కరవు నివారణకు తెలుగుగంగ, హంద్రీ నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన నాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు తనకు స్ఫూర్తి అన్నారు. ప్రజలే ముందు అంటూ వారి కోసం పనిచేస్తున్నానన్నారు. ప్రజలకు తనపై నమ్మకంతో అధికారం ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా శక్తివంచన లేకుండా కష్టపడుతున్నానన్నారు. మూడు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన జరిగింది. రూ.1600 కోట్ల లోడు బడ్జెట్‌తో కట్టుబట్టలతో బయటకొచ్చాం. ఆ రోజు చాలా సమస్యలున్నాయి. అయినా భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను.. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించాను..మీ అభిమానం చూరగొన్నాను అని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తనపై చాలా అభిమానం చూపారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని సిఎం అన్నారు.రాష్ట్రంలో పైసా కూడా అవినీతి జరగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తానని చంద్రబాబు అన్నారు. మీ ముఖాల్లో ఆనందం చూడాలని రేయింబవళ్లు కష్టపడ్డానని, సమస్యలన్నీ పరిష్కరించానని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. విండ్, సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టామన్నారు. కరెంటు చార్జీలు తగ్గించి ప్రజలకు భారం లేకుండా చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేదన్నారు. కుల, మత వర్గాలకు అతీతంగా అందరికీ పథకాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, మీ జీవితాల్లో వెలుగులు నింపేంత వరకు, మీ సమస్యలు పరిష్కరించేంత వరకు మీ వెంటే ఉంటానని ప్రకటించారు. గడచిన కాలంలో పాలకులు ప్రాజెక్టులు ప్రారంభించి ఉంటే నాకు ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావన్నారు. అయినా 1996లో శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను పూర్తి చేయడం తన పూర్వజన్మ సుకృతమని, ఆ అదృష్టం తనకే దక్కిందన్నారు. రాయలసీమలో ఏ పని ప్రారంభించినా అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తానన్నారు. అందులో భాగంగా హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా రైతుల సమస్యలను గుర్తించి గుంతకల్లులో రైతు రుణమాఫీ ప్రకటించానన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో రూ.24 వేల కోట్లు రుణ విముక్తికి శ్రీకారం చుట్టానన్నారు. ప్రస్తుతం మూడో విడత రుణమాఫీకి నిధులు ఇస్తానన్నారు. డ్వాక్రా, మెప్మా సంఘాలకు రూ.10 వేల రుణమాఫీలో రూ.6వేలు ఇచ్చానని, మిగతా రూ.4వేలు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ముచ్చుమర్రి నుంచి అనంతపురం జిల్లాకు నీరిచ్చి ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అమలు చేయనున్న లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించి జీవోను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఆఖరులో ప్రజలతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, కలెక్టర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు.