ఆంధ్రప్రదేశ్‌

వచ్చే 9నుంచి నగదు రహిత విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: నగదు రహిత విశాఖ కార్యక్రమాన్ని అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనున్నట్టు వీసా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌కు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నగదు రహిత విశాఖ అమలుపై సమీక్ష నిర్వహించారు. దేశంలోనే పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరిగే నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు వీసా ప్రతినిధులతో గతంలోనే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రికి వీసా ప్రతినిధులు వివరిస్తూ, తాము చేపట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మంచి ఫలితాలు వచ్చే దిశగానే తమ ప్రణాళిక సాగుతున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో పూర్తి స్థాయి ప్రణాళికతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నగదు రహిత లావాదేవీలు జరిపే వారిపై సర్‌చార్జి భారం లేకుండా కొత్త విధానం రూపొందించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే దీనికి తుది రూపం ఇస్తామన్నారు. విశాఖలో అమలు చేయనున్న ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శం కానుందన్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ క్యూఆర్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, ఇతర శాఖలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ డెలివరీ, వర్సిటీలు, దుకాణాల్లో భారత్ క్యూఆర్‌ను ఉపయోగించే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పర్యాటక శాఖ, రవాణా శాఖ, మీ-సేవ కేంద్రాల్లో ఈ తరహా లావాదేవీలు జరిగేలా అన్ని శాఖలతో చర్చిస్తానన్నారు. నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రజలపై ఒత్తిడి తీసుకురావద్దని, కేవలం అవగాహన కల్పించాలన్నారు.
ఐటిలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం
ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ విభాగాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలతో ఎప్పటికప్పుడు చర్చలు జరపాలన్నారు. కంపెనీల వారిగా ఎంత పెట్టుబడి పెట్టనున్నారు.. ఎన్ని ఉద్యోగాలు రానున్నాయన్న అంశంపై దృష్టి సారించాలన్నారు. భూ కేటాయింపులు, ఇతర సౌకర్యాల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఆఫీసు స్పేస్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆఫీస్ స్పేస్ కల్పనకు అమల్లోకి తెచ్చిన కొత్త డిటిపి విధానం గురించి వివరించాలన్నారు. లక్ష ఐటి ఉద్యోగాలు రావాలంటే కనీసం కోటి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం అవుతుందన్నారు. లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు తమ పనితీరును మార్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రం హబ్‌గా మారనుందని, ఇందుకు అవసరమైన వాతావరణం కల్పించాలన్నారు. ఒప్పందం జరిగిన నాటి నుంచి కార్యకలాపాలు జరిపేందుకు పట్టే సమయం తెలుసుకోవాలని, రియల్ టైమ్ ట్రాకర్‌ను సిద్ధం చేయాలన్నారు.

చిత్రం..వీసా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్