ఆంధ్రప్రదేశ్‌

గిరిజన, కొండ ప్రాంతాల్లో అందుబాటులోకి బ్యాంకింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో మారుమూల గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 12వ రాష్టస్థ్రాయి కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో సరైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేక వారి ఆర్థిక అవసరాలకై ప్రైవేట్ పెట్టుబడులు, వడ్డీ వ్యాపారులపై ఆధారపడి అనేక మోసాలకు గురవుతున్నారని తెలిపారు. అంతేగాక ప్రభుత్వం నుండి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా మంజూరైన నిధులను దాచుకునేందుకు సరైన బ్యాంకులు లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బోగస్ చిట్‌ఫండ్ కంపెనీల్లో వారి సొమ్ము పొదుపు చేసి మోసపోతున్నారన్నారు. అంతేగాక నూటికి 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించడమే గాక వారంతా వ్యవసాయంపైనే ఆధారపడినందున ఆ రైతాంగానికి బ్యాంకుల ద్వారా అవసరమైన రుణాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని బ్యాంకు బ్రాంచీలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బోగస్ చిట్‌ఫండ్ కంపెనీలు పెట్టి ప్రజల నుండి పెట్టుబడులు ఆకర్షించి మోసం చేసేందుకు ప్రయత్నించే సంస్థలపై సకాలంలో విచారించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విధమైన మోసాలకు పాల్పడేవారిలో ఒక భయం కలిగే విధంగా సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలు పెట్టి ప్రజలను మోసం చేయడం ఆర్థిక టెర్రరిజం వంటిదని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా బోగస్ చిట్‌ఫండ్ కంపెనీలు పెట్టి ప్రకటనలు ఇచ్చి తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే గుర్తించి ఆ ప్రకటనల్లో ఎంతమేరకు వాస్తవం ఉందో పరిశీలించాలన్నారు. ఒకవేళ వాస్తవం లేకుంటే వెంటనే ప్రత్యేక ప్రకటనలు జారీచేసి అలాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టవద్దని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని తెలిపారు. అదే విధంగా బోగస్ చిట్‌ఫండ్ కంపెనీలు, ఇతర మోసపూరిత ఆర్థిక సంస్థలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోకుండా వివిధ సినిమా థియేటర్లలోను, రేడియో, టివి, పత్రికలు తదితర ప్రసార మాద్యమాల్లోనూ ప్రకటనలు జారీచేయడం ద్వారా విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంత రీజనల్ డైరక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన అనంతరం వివిధ సంస్థలతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్బీఐ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నకిలీ ఆర్థిక సంస్థల ఆగడాలను నియంత్రించేందుకు సంబంధిత శాఖలు, ఏజెన్సీలతో కలిసి సకాలంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. అంతకుముందు అజెండాలోని వివిధ అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, సిఐడి ఐజి అమిత్ గార్గ్, ఆర్బీఐ ఎజిఎం రమణమూర్తి, ఆర్బీఐ ఇతర ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సెబి, తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఆర్‌బిఐ రాష్టస్థ్రాయి కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం