ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌ను విడిచిపెట్టేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ అనేక పదవులు నిర్వహించానన్నారు. కేంద్ర మంత్రి గా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించానన్నారు. మధ్యలో ఓ రెండేళ్లు మినహా పార్టీకి ఎప్పుడూ దూరం కాలేదన్నారు. ఈ వయస్సులో పార్టీ మారడం అంత అవసరమా అంటూ దీనిని ప్రజలు హర్షించరన్నారు. పార్టీ మారితే అవకాశవాదిగా చూస్తారన్నారు. విశాఖ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది సందిగ్ధంలో ఉందన్నారు. గత 18 ఏళ్ళుగా తాను విశాఖవాసుల నుంచి ఓటును అడగలేదన్నారు. సామాజిక, వైద్య,క్రీడా, ఆధ్యాత్మికపరంగా తాను సేవలందిస్తూనే ఉన్నానన్నారు. విశాఖను దత్తత తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సానుభూతికే ఓటు వేసారనాన్నారు. ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా ఇటువంటి పరిస్థితులే ఉంటాయన్నారు. ఓటర్లు కూడా పరిచయం ఉండే అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు.