ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 9: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో పలు మండలాల్లో దాచి ఉంచిన ఎర్రచందనం స్వాధీనంచేసుకున్నామని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ చెప్పారు. శనివారం ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇద్దరు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లు, 19 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేయడంతో సహా రూ.1.2కోట్ల రూపాయల విలువైన 51 దుంగల స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలోని రాపూరు, అనంతసాగరం, కలువాయి ప్రాంతాల్లో 15 మంది ఎర్రచందనం కూలీలను, ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను శనివా రం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 33 ఎర్రచందనం దుంగల్ని హైదరాబాద్‌కు చెందిన మహమూద్ ఆసీఫ్ సహాయంతో ఢిల్లీకి చెందిన మరో స్మగ్లర్‌కు రవాణా చేసే ప్రయత్నిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో కోటి 25లక్షలు ఉంటుందన్నారు. వీరివద్దనుంచి ఓ మోటార్ బైక్‌ను స్వాధీ నం చేసుకున్నామన్నారు.