ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: దేశంలోనే అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దాసరి భవన్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాగు, సాగునీటితోపాటు 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములను త్యాగం చేసిన వారికి న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. అనేకమంది నిర్వాసితులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందన్నా రు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసినా ఫలితం లేదన్నారు. కొందరు పెద్దలు ముంపు ప్రాంతాలకు చెందిన వారి భూములను గతంలోనే కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి నిర్వాసితులకు కలిగే లబ్ధిని కాజేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి వారం పోలవరంపై సమీక్షించే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విష యం ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరు తూ 12వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో కుక్కునూరులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సిఎం చంద్రబాబును కలసి నిర్వాసితుల కష్టాలను వివరిస్తామన్నారు.