ఆంధ్రప్రదేశ్‌

గోదావరి డెల్టాపై శే్వతపత్రం విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి డెల్టాకు నష్టం కలుగకుండా కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని ఎలా తీసుకెళతారో గోదావరి డెల్టా ప్రజలు, రైతులకు స్పష్టమైన హామీనివ్వటంతో పాటు శే్వతపత్రాన్ని విడుదలచేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేసారు. శనివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు అమరావతి ప్రాంతంతో పాటు గోదావరి జిల్లాలకు కూడా ముఖ్యమంత్రినేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జూన్ 2వ వారంలోనే నీటిని కృష్ణా జిల్లాకు విడుదలచేస్తామని చెబుతున్న చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జూన్ మొదటివారంలో గోదావరిలో నీరు కృష్ణా తరలించే స్థాయిలో ఉండదన్నారు. అలాంటపుడు నీటిని తరలిస్తే గోదావరి జిల్లాలకు నష్టం జరుగుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం మార్చి 17నాటికి పూర్తయిందనిపించటం ద్వారా మరో రూ.400కోట్లు కాంట్రాక్టరుకు విడుదలచేయాలన్న తొందరలో ముఖ్యమంత్రి ఉన్నారని ఉండవల్లి విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు తీరును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ దాఖలుచేసిన పిటిషన్‌పై ఇంత వరకు రాష్ట్రప్రభుత్వం కౌంటర్ దాఖలుచేయలేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పట్టిసీమను అడ్డంపెట్టుకుని ఇపుడు కెసిఆర్ శ్రీశైలం రిజర్వాయరులో నిబంధనలకు విరుద్ధంగా పైపులు పెట్టి పాలమూరుకు నీటిని తీసుకెళ్లే ప్రయత్నంచేస్తున్నారన్నారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు తానే కృషిచేసానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. యుపిఎ ప్రభుత్వం చేసిన తీర్మానానే్న ఆర్డినెన్స్‌గా ఆమోదించినట్టు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంగా చెప్పారన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుదైన గౌరవం దక్కిన తరువాత కూడా ఇంకా అబద్ధాలు చెప్పటమెందుకని ప్రశ్నించారు. అమరావతి భూ కుంభకోణాలపై వస్తున్న ఆరోపణలపై సిటింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు, న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేసారని ఉండవల్లి గుర్తుచేసారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16వేల కోట్ల నుండి రూ.32వేల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. 2018నాటికి మొదటి దశ పోలవరం పూర్తవుతుందని చెబుతున్న సిఎం అసలు మొదటి దశ అంటే ఏమిటో చెప్పాలన్నారు. విభజన హామీలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమహేంద్రవరం సభలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.