ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకోసం ఆశావహుల ముమ్మర యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 9: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు పతాకస్థాయికి చేరాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఈ రెండు పదవులను కైవశం చేసుకునేందుకు మార్గం సుగమం కావడంతో పార్టీకి చెందిన కార్పొరేటర్లు విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. ఈనెల 1వ తేదీన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం విధితమే! ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఈనెల 16వ తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఈ రెండు పదవులను టిడిపి అధిష్ఠానం ఎంపిక చేసి సీల్డ్‌కవర్స్‌లో పంపనుంది. ఈలోగా ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో 48 కార్పొరేటర్ స్థానాలకు గాను తెలుగుదేశం 32 స్థానాల్లోను, మిత్రపక్షం బిజెపి మరో 3 స్థానాల్లో మొత్తం 35సీట్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. కేవలం 10 స్థానాల్లో ప్రతిపక్ష వైసిపి, మూడు చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మకమైన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ దఫా కాకినాడ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని మహిళ (జనరల్)కు కేటాయించారు. సామాజిక సమీకరణలలో భాగంగా మేయర్ పీఠాన్ని కాపు సామాజికవర్గ మహిళకు కేటాయిస్తామని టిడిపి ముందుగానే ప్రకటించింది. దీంతో ఆ సామాజికవర్గ మహిళా కార్పొరేటర్లలో తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి సంబంధించి సుమారు 9 మంది కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో అరజడను మంది వరకు మహిళా కార్పొరేటర్లు మేయర్ పదవిని ఆశిస్తున్నప్పటికీ పోటీ ప్రధానంగా నలుగురి మధ్య నడుస్తోంది. వీరిలో అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్, సుంకర పావని, మాకినీడి శేషుకుమారి, సుంకర శివప్రసన్నలు మేయర్ పీఠానికి పోటీ పడుతున్నారు. మేయర్ రేసులో ఉన్న అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్ అడ్వకేట్ కావడంతోపాటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన ఘనత సాధించారు. మాకినీడి శేషుకుమారి భర్త వృత్తిరీత్యా వైద్యుడు కాగా పార్టీలో పైస్థాయిలో ఉన్న పలుకుబడి తనకు కలసివస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈమె 20 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. సుంకర శివప్రసన్న విషయానికి వస్తే విద్యాధికురాలు కావడంతోపాటు ఈమె భర్త విద్యాసాగర్‌కు తెలుగుదేశం పార్టీ నగర రాజకీయాల్లో పట్టుంది. మరో కార్పొరేటర్ సుంకర పావని కూడా మేయర్ పీఠం కోసం విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. ఈమె భర్త తిరుమలకుమార్ ప్రస్తుతం కాకినాడ నగర టిడిపి అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీలో సీనియర్ అయిన సుంకర కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందన్న ధీమాతో ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని బిసికి కేటాయిస్తారని స్పష్టం కావడంతో ఆ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ప్రయత్నాల్లో ఉన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సోదరుడి కుమారుడు వనమాడి ఉమాశంకర్ సహా మరికొందరు బిసి వర్గానికి చెందిన ఆశావహులు డిప్యూటి మేయర్ పదవిని ఆశిస్తున్నారు.