ఆంధ్రప్రదేశ్‌

పండిట్ శివకుమార్ శర్మకు ప్రతిభా పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (ఆరిలోవ) సెప్టెంబర్ 9: ప్రపంచ ప్రఖ్యాత ‘సంతూర్’ విద్వాంసులు, పద్మవిభూషణ్ పండిట్ శివకుమార్ శర్మకు అతిథులు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీ కొప్పరపుకవులు కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు. కొప్పరపు కవుల పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మాశర్మ సారథ్యంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం పంచాదశ వసంతోత్సవం శనివారం రాత్రి కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అతిథులు అవధాన కంఠీరవ నరాల రామారెడ్డికి కొప్పరవు కవుల అవధాన పురస్కారం ప్రదానం చేశారు. మహా సహాస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో పరమహంస, పరివ్రాజకాచార్య కుర్తాళ పీఠాధిపతులు శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి, దాదాసాహేబ్ పాల్కే పురస్కార గ్రహీత, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ పురస్కార గ్రహీతలకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పదాధికారి చెరువు రామకోటయ్య, మోహన్ హెమ్మాడి, డాక్టర్ సూరపనేని విజయకుమార్ పాల్గొన్నారు. కొప్పరపు కవుల కళాపీఠం పేరున సంగీత సాహిత్యాలకు సంబంధించిన ప్రముఖులను సత్కరించడం ముదావహమని అతిథులు పేర్కొన్నారు. కర్ణాటక లలిత సంగీత విద్వాంసుడు, సినీ నేపధ్య గాయకుడు బిఏ నారాయణ, కొప్పరపు సోదర కవుల పద్యాలను మధురంగా గానం చేసి ఆహుతులను అలరించారు.

చిత్రాలు..పండిట్ శివకుమార్ శర్మకు కొప్పరపు కవుల పురస్కారం, అవధాన కంఠీరవ నరాల రామిరెడ్డికి అవధాన పురస్కారాలను ప్రదానం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు టిఎస్సాఆర్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్