ఆంధ్రప్రదేశ్‌

అవగహనా రాహిత్యంతోనే అపోహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, సెప్టెంబర్ 9: హిందూ ధర్మాన్ని పరిరక్షణకు దేవాలయాల నిధులు ఖర్చు చేయడం సమంజసమేనని రాష్ట్ర దేవాలయాల పరిపాలన సంస్థ (సితా) డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు అన్నారు. సితా వ్యవహరంపై గతంలో దేవాదాయ శాఖలోని కొంత మంది అధికారులు, దేవాలయాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, వివాదం రేగడం తెలిసిందే. చాలా కాలంగా వౌనంగా ఉన్న ఈ వ్యవహరం శనివారం సింహాచలంలో సితా డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. సితాపై జరిపిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో రాష్ట్ర దేవాదాయ, దేవాలయాల ఉద్యోగుల సంఘం కన్వీనర్‌గా సింహాచలం ఈవో రామచంద్రమోహన్, రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు రామరాజు (హరిరాజు) ఇద్దరూ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన వారే కావడం రాఘవాచార్యులు సింహగిరిపైనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భజన మండళ్ళ శిక్షణా తరగతులకు వచ్చిన రాఘవాచార్యులు శనివారం విలేఖరులతో మాట్లాడారు. హిందూ ధర్మం కోసం ట్రస్ట్ చేపడుతున్న పనులను వివరించిన ఆయన దేవాలయాల నిధులను ట్రస్ట్ నిర్వహణకు ఉపయోగిస్తున్నారంటూ పలువురు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. దేవాదాయశాఖ నిబంధనలలోనే హిందూ ధర్మ ప్రచారం కోసం నిధులు ఖర్చుచేయమని ఉందని ఆయన వెల్లడించారు. భగవంతుడికి మొక్కుల రూపంలో హిందువులు సమర్పిస్తున్న సొమ్మును హిందూ ధర్మం ప్రచారానికి వాడుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. అవగహన లేనివారు చేస్తున్న ఆరోపణగానే దీని పరిగణిస్తున్నామని ఆయన సమర్థించుకున్నారు. ఇది వివాదాలకుపోయే సమయం కాదని ధర్మ ప్రచారం ముమ్మరంగా సాగుతోందని, ఇందు కోసం దేవాదాయ శాఖ, దేవాలయాల ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు. పరాయి దేశాల నుండి వస్తున్న నిధులతో కొన్ని సంస్థలు హిందూ ధర్మ ప్రచారాన్ని అడ్డుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. మతం మార్పిడులను నిరోధించడానికి టిటిడి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన తండాలు, దళిత వాడల్లో 500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 300 ఆలయాలు పూర్తయ్యాయన్నారు. ఆయా ప్రాంతాల వారికే అర్చకులుగా శిక్షణనిచ్చి వారికి నచ్చిన దేవతలను ఆ దేవాలయాల్లో ప్రతిష్ఠించి అర్చన చేసే ప్రక్రియ టిటిడి విజయవంతంగా నడిపిస్తోందని అన్నారు.
సామాజిక ప్రయోజనం, జాతీయ సమైక్యత అనే ప్రాతిపదికపై దివంగత పివిఆర్‌కె ప్రసాద్ అధ్యక్షతన ధర్మప్రచార కార్యక్రమాలు గత రెండేళ్లుగా చేపడుతున్నామన్నారు. కేవలం పండితులకో, శాస్తజ్ఞ్రులకో, మహా విద్వాంసులకో పరిమితమైన శాస్త్రాలను సమాజపరం చేయాలంటే భజన మార్గమొక్కటే సరైనదని ఆయన అన్నారు. భక్తిని ప్రచారం చేయడానికి పండితులు కానక్కర్లేదు, శాస్తజ్ఞ్రానం అంతకన్నా అవసరం లేదన్న వ్యూహంతో భజన మండళ్లను ఏర్పాటు చేసుకుని ప్రధాన దేవాలయాలు కేంద్రంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.

చిత్రం.. సింహాచలేశుని సన్నిధిలో సితా డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు