ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించడం వలన వారంతా కృతజ్ఞతాభావంతో ఉంటారనేది వైద్యులు, సిబ్బంది గుర్తించాలన్నారు. శనివారం విజయవాడ ప్రభుత్వాసుపత్రి డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మేర వౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. అలాగే ప్రతి ఆసుపత్రిలో వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బందిని నియమించి రోగులకు మెరుగైన వైద్యసేవలందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యులు తమ సేవలను సజావుగా నిర్వహించే విధంగా వారికి కూడా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. సాధారణంగా వైద్య సేవలందించే సమయంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయని, అయితే వాటిల్లో వైద్యుల లోపం ఉండరాదన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారని ఎక్కువ మంది వచ్చే సమయంలో ప్రత్యేక ఓపి తెరువాలంటూ మంత్రి కామినేని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రతిరోజూ లక్షా 60వేల మంది ఓపిలో నమోదవుతున్నారని, ఒక్క విజయవాడ ఆసుపత్రిలోనే 1500 మంది నుంచి 2వేల మంది వరకూ నమోదవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చక్రధరరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్