ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రవాణా శాఖలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయడంతోపాటు వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో అరికట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని రవాణాశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. రవాణాశాఖ టెక్నికల్ అధికారుల రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని ఎపి ఎన్జీవో హోంలో శనివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల 200 హోంగార్డులను నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే సాంకేతిక అధికారులకు వాహనాల కొరతను తీర్చేందుకు త్వరలోనే వాహనాలను సమకూర్చుతామన్నారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని, ఆ దిశలో రవాణాశాఖ అధికారులు, సిబ్బంది మరింత చురుకైన పాత్రను పోషించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లాలో వినూత్నమైన ప్రక్రియను శ్రీకారం చుట్టి అమలు చేశామని ఆయన తెలిపారు. జూలై నెలలో 25 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, ఆగస్టు నెలలో ఒకే ఒక్క ప్రమాదం నమోదు కావడం గమనార్హమన్నారు. ఇదే తరహా విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తే ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్ర సంఘ కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక
ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో రవాణా టెక్నికల్ అధికారుల రాష్ట్ర సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఎపి ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు పి అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రవాణా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం అధ్యక్షునిగా కెవి సుబ్బారావు, సహాయ అధ్యక్షునిగా ఆర్‌సిహెచ్ శ్రీనివాస్, టికెపి రెడ్డి, కెఎస్‌ఎన్‌బి కృష్ణారావు, జివి మాధవరెడ్డి, ఉపాధ్యక్షులుగా సితాపతిరావు, జె బాలానాయక్, సి వాసుదేవరెడ్డి, ఎన్‌ఎస్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కె సీతారామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె ప్రవీణ్‌కుమార్, డిఎస్‌ఎం వరప్రసాద్, ఆర్ రాజేంద్రప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా కెఎస్ దీప్తి, ఎస్ వెంకటరావు, టి క్రాంతికుమార్, ఎం రవికుమార్, టి రాఘవరావు, సలహాదారులుగా సిహెచ్ సంపత్‌కుమార్, ఎహెచ్ ఖాన్, టెక్నికల్ కమీటి సభ్యులుగా బాలమురళీకృష్ణ, ఎం శశికుమార్, సివి రమణ, ఐ సాయినాథులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎండి ఇక్బాల్, సహాయ ఎన్నికల అధికారి పి రాజశేఖర్‌లు ప్రకటించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎన్నికల అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు