ఆంధ్రప్రదేశ్‌

2019లో టిడిపి ఘనవిజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి జరగనున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో గ్రామగ్రామానా, వార్డు వార్డునా ప్రతి ఇంటిపై తెలుగుదేశం జెండా ఎగరాలి.. ప్రతి కుటుంబంలో మన పార్టీ సభ్యత్వం ఉండాలి.. ప్రతి ఇంటి తలుపుపై పార్టీ స్టిక్కర్ అంటించాలి.. ఇంటింటికి వెళ్లాలి.. ప్రతి ఒక్కరిని పరామర్శించాలి.. వాళ్ల యోగ క్షేమాలు తెలుసుకోవాలి.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో విచారించాలి.. ఎంత బాగా చేశారు అనే కాకుండా ఎంత సమర్థంగా ప్రజలకు దగ్గరయ్యారు అనేదే ముఖ్యం.. సెప్టెంబర్ 11న శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో నేను పాల్గొంటాను.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఖాయం.. అంటూ తెలుగుదేశం నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది బల ప్రదర్శన కోసం కాదని, ప్రజా సేవకు మనం వెళ్తున్నామని, కష్టాల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ మూడేళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుకూలత సుస్థిరం చేసేందుకే ఇంటింటికి వెళ్తున్నామని, ఆధిపత్యం చూపడానికి కాదని, ఇగో ప్రదర్శించడానికి కాదన్నారు. ఇన్ని కష్టాల్లో కూడా పనులు చేస్తున్నాం, కాబట్టే ప్రజల్లో 80 శాతం సంతృప్తి, సానుకూలత ఉందని, దాన్ని మరింత పెంచుకోవడమే మన లక్ష్యం అన్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిదికాదు, మనపై వ్యతిరేకత ఉన్నవారి మనసులు కూడా గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. వినమ్రత, మన భాష, మన సేవాభిలాష ప్రజల మెప్పు పొందేలా ఉండాలన్నారు. ఏరోజు ఏ గ్రామంలో కార్యక్రమం జరిగేది ముందే షెడ్యూల్ ఇవ్వాలన్నారు. ఇళ్ల స్థలం కావాలా, పక్కా ఇల్లు కావాలా, గ్యాస్ కనెక్షన్ కావాలా, పింఛన్ కావాలా అని ప్రతి ఒక్కరిని ప్రశ్నించి వాళ్ల అవసరాలను గుర్తించి, ప్రత్యేక యాప్‌లో వాటిని నమోదు చేయాలన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత నాయకులు అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. మన బలహీనతలు ఎదుటివాళ్లకు బలాలు కాకూడదని, బలహీనతలు వదులుకుని, బలాలు పెంచుకోవాలన్నారు. ఎవరికీ లేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంస్థాగత, వ్యవస్థాగత బలం తమ పార్టీకి ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి పదవి ఇవ్వలేదని దుష్ప్రచారం చేసి ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని కొందరు చూశారన్నారు. నంద్యాల, కాకినాడ ఘన విజయం దరిమిలా రాష్ట్రంలో ఏ స్థానంలో కూడా గెలుపు తమకు కష్టం కాదని, అన్ని స్థానాల్లో గెలుపును నంద్యాల, కాకినాడ నల్లేరు మీద నడక చేశాయని వ్యాఖ్యానించారు. నంద్యాలలో కొత్తకుర్రాడు, మొహమాటస్తుడు, అయినా ఇంత ఘన విజయం సాధ్యం అయిందంటే దానికి ప్రభుత్వంపై ఉన్న సానుకూలతే కారణమన్నారు. ఉరవకొండలో జరిగిన ‘జలసిరికి హారతి’కి ఊహించని విధంగా ప్రజల్లో స్పందన వచ్చిందని, ప్రభుత్వంపై సానుకూలత వల్లే అటు రాయలసీమ (నంద్యాల), ఇటు కోస్తాంధ్ర (కాకినాడ) రెండుచోట్ల 16 శాతం ఆధిక్యత సాధించగలిగామన్నారు. విజయాలకు అందరూ యాజమాన్యం వహిస్తారు కాని వైఫల్యాలకు ఎవరూ బాధ్యత తీసుకోరని, అయితే విజయం ఉత్సాహంతో పాటు బాధ్యతను రెట్టింపు చేస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయగలిగితేనే పదవులు తీసుకోవాలన్నారు. ప్రజలు, కార్యకర్తలతో నాయకులు మమేకం కావాలని సూచించారు. గ్రామ కమిటీ సభ్యులు కూడా టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 11.72 శాతం వచ్చింది.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 27.60 శాతం వృద్ధి సాధించగలిగాం.. హార్టీకల్చర్ రంగంలో వృద్ధిని 35 శాతంకు తీసుకెళ్లాల్సి ఉంది.. కోటి ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరగాలి, ప్రస్తుతం కంటే రెండున్నర రెట్లు పెరగాలి.. సూక్ష్మసేద్యం కోటి ఎకరాలకు విస్తరించాలి, ప్రస్తుతం కంటే 5రెట్లు పెరగాలి.. మత్స్య పరిశ్రమకు కాలుష్య బెడద ఉంది కాని ఉద్యానరంగానికి ఆ సమస్య లేదు.. సాగునీటి భద్రత కల్పించేందుకే మూడు నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం.. ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేల ఆదాయం రావాలి.. పుట్టుక నుంచి చనిపోయే వరకు వ్యక్తి అన్ని దశల్లో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. అందుకు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలంటూ’ పార్టీ నేతలకు మార్గదర్శనం చేశారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి వైఎస్ చౌదరి, రాష్ట్ర మంత్రులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర నాయకులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.