ఆంధ్రప్రదేశ్‌

ఊపందుకున్న ఎల్‌ఎంసి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో మిగులు పనులను కొత్త కాంట్రాక్టులకు ప్రభుత్వం అప్పగించింది. పనులను మరింత వేగంగా పూర్తి చేసి 2018 నాటికి గ్రావిటీ, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇపుడున్న కాంట్రాక్టు సంస్థలతో పాటు మరిన్ని సంస్థలను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ మేరకు పనులు తాజాగా అప్పగించింది. ఈ నేపధ్యంలో ఎడమ ప్రధాన కాలువ పనుల్లో మిగులు పనులు ఊపందుకున్నాయి. మొత్తం ఎనిమిది ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ఏలేరుకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని సత్వరం అందించాల్సిన నేపధ్యంలో అవసరమైన స్ట్రక్చర్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు మొదటి ప్యాకేజీలో మిగిలిపోయిన పనులను సత్వరం పూర్తి చేసేందుకు తాజాగా కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. అలాగే మిగిలిన ప్యాకేజీల్లో కూడా మిగిలిపోయిన పనులను కొత్తగా కొన్ని సంస్థలకు అప్పగించారు. నిర్ధేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టారు. ఎడమ కాలువ పనుల్లో ఐదవ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.142.88 కోట్ల విలువైన పనులను హెచ్‌ఇఎస్ సంస్థకు అప్పగించారు. ఒకటవ ప్యాకేజీలో మిగిలిపోయిన పనులను సూర్య కనస్ట్రక్షన్స్‌కు అప్పగించారు. నాలుగో ప్యాకేజీలో మిగిలిపోయిన పనులను ఆర్‌ఎస్‌ఆర్ సాగిట్రాల్ సంస్థకు అప్పగించనున్నట్టు తెలిసింది. సబ్ కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు కూడా ప్రభుత్వంతో అనుబంధ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఎడమ ప్రధాన కాలువలో ఒకటవ ప్యాకేజీ మొత్తం 0 కిలో మీటర్ల నుంచి 25.6 కిలో మీటర్ల వరకు విభజించారు. ఈ పరిధిలో మొత్తం 50 స్ట్రక్చర్లు వున్నాయి. ఇప్పటి వరకు 15 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. 11 స్ట్రక్చర్ల పనులు జరుగుతున్నాయి. ఈ ప్యాకేజీ పనులను మొత్తం రూ. 254 కోట్లతో చేపట్టారు. ప్రస్తుతం 24 స్ట్రక్చర్ల పనులను చేపట్టారు. సుమారు రూ.167 కోట్ల పనులు పూర్తయ్యాయి. తాజాగా 60సి కింద రూ.171.39 కోట్ల విలువైన పనులను తాజాగా సూర్య కనస్ట్రక్చన్స్‌కు అప్పగించారు. 2018 జూన్ నాటికి పూర్తి చేయాలని ఈ పనులకు నిర్దేశించారు. ఈ మిగులు పనుల్లో 11 పాత ప్యాకేజీలోని స్ట్రక్చర్లు, కొత్తగా 22 స్ట్రక్చర్లు వెరశి 33 స్ట్రక్చర్లు ఉన్నాయి. కొత్త కాంట్రాక్టు సంస్థ ప్రస్తుతం పోలవరం కాలువ ద్వారా పురుషోత్తపట్నం నీటిని ఏలేరుకు సరఫరా చేయాల్సిన నేపధ్యంలో 16.3 కిలో మీటర్ల వద్ద గుమ్మళ్లదొడ్డి గ్రామం వద్ద ఒక బ్రిడ్జి, 25.6 కిలో మీటర్ల వద్ద గాదరాడ వద్ద ఒక బ్రిడ్జి, 1.75 కిలో మీటర్ల వద్ద రెగ్యులేటర్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. 15 కిలో మీటర్ల మేర లైనింగ్ పనులు కూడా ఈ ప్యాకేజీ పరిధిలో పూర్తి చేయాల్సి ఉంది. పాత కాంట్రాక్టు సంస్థే బ్యాలెన్స్ ఎర్త్ వర్కు, లైనింగ్ పూర్తి చేయాల్సి వుంది. మొత్తం మీద మొదటి ప్యాకేజీ పనులను సత్వరం పూర్తయితే ఏలేరుకు పోలవరం కాలువ ద్వారా నీటిని అందించేందుకు లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక రెండో ప్యాకేజీ పనులను నిర్వహించేందుకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. పోలవరం ఎడమ కాలువ 181.50 కిలో మీటర్లు పొడవులో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు.