ఆంధ్రప్రదేశ్‌

ఆరు నెలల్లో కనకదుర్గ ఫ్లైఓవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31నాటి కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు. వెలగపూడి సచివాలయంలో శనివారం తన కార్యాలయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పనులు మందకొడిగా సాగిస్తూ నిర్మాణ సంస్థ ‘సోమా’ ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచి, ఇక నుంచి 24 గంటలు పగలు, రాత్రి పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలుగకుండా, శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు ఈనెల 11న ఉదయం 6 గంటల నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈనెల 20 నుంచి 30 వరకు మాత్రం నడకదారికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. రహదారి మూసివేసిన అన్ని రోజులు పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రహదారులపై రద్దీ నిర్వహణ సమర్థంగా జరగాలని చెప్పారు. సితార జంక్షన్ దగ్గర రహదారికి విస్తరణ చేట్టామని, ఇప్పటికే అవసరమైన మరమ్మతులు పూర్తిచేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కనకదుర్గ ఫైఓవర్ నిర్మాణం కోసం నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు, అలాగే 2018 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కృష్ణా ఈస్ట్ డెల్టా ప్రధాన కాలువ ప్రవాహాన్ని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అటు దుర్గగుడి సమీపంలోని ఏపి ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

చిత్రం..కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు