ఆంధ్రప్రదేశ్‌

నూతన ఆవిష్కరణలకు వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ వేదికగా నిలిచిందని అంతర్జాతీయ ఇన్నోవేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు అలిరేజా రాస్టేగర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ -2017ను విశాఖలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా జరిగే ప్రదర్శనల ద్వారా ఔత్సాహికుల్లో ప్రేరణ సరికొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోందని, వీటిని ఉపయోగించుకుని పోటీ పడాలని సూచించారు. ఔత్సాహిక యువత నూతన ఐటి ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఇండియన్ ఇన్నోవేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎఎస్ రావు మాట్లాడుతూ సరికొత్త ఐటి ఆవిష్కరణల వల్ల ఔత్సాహికులు ముందుకు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఇన్నోవేషన్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు 600 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 60 మందికి మాత్రమే అవకాశం కల్పించగలిగామన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొరియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్, స్వీడన్, యుఎస్‌ఎ, తదితర 30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఆయా దేశాల ఐటి రంగంలో నిపుణులు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఐటి రంగంలో వస్తున్న ఆధునిక పరిణామాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్స్ సొసైటీ సిఇఓ ప్రొఫెసర్ వి వల్లీకుమారి మాట్లాడుతూ నవ్యాంధ్రలో ఐటి రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. ఇక్కడ యువతలో తెలివితేటలు, సామర్థ్యం మెండుగా ఉందని, ప్రపంచ స్థాయి సాంకేతికతను వారికి అందుబాటులోకి తెస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ‘యువ శాస్తవ్రేత్తలు, సైంటిస్ట్‌ల ప్రాజెక్టుల అబ్‌స్ట్రాక్ట్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చిత్రం..ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో ప్రసంగిస్తున్న
అంతర్జాతీయ సమాఖ్య అధ్యక్షుడు అలిరేజా రాస్టేగర్